- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPE 2026 : ఏకేవీఆర్ జూనియర్ కాలేజ్‌కు పరీక్షా కేంద్ర బాధ్యతలు
by Ratna Kumari |
భీమదేవరపల్లి మండలంలోని ఏకేవీఆర్ జూనియర్ కాలేజ్ (సెంటర్ కోడ్: 38204)ను IPE-2026 పబ్లిక్ పరీక్షల కేంద్రంగా అధికారికంగా ప్రకటించారు.

X
దిశ, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలంలోని ఏకేవీఆర్ జూనియర్ కాలేజ్ (సెంటర్ కోడ్: 38204)ను IPE-2026 పబ్లిక్ పరీక్షల కేంద్రంగా అధికారికంగా ప్రకటించారు. ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 24-02-2026న చీఫ్ సూపరింటెండెంట్‌గా పి. శ్రీదేవి, విభాగాధికారి (D.O.)గా వి. కళ్యాణరావు నియమితులయ్యారు. అదనపు చీఫ్ సూపరింటెండెంట్‌గా బి. శ్రీకాంత్‌రావు 25-02-2026న బాధ్యతలు స్వీకరించారు. పరీక్షలు పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, భద్రతా ఏర్పాట్లు, గదుల కేటాయింపు వంటి అన్ని చర్యలు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.
Next Story






