పార‌ద‌ర్శ‌కంగా ఫిర్యాదుల‌పై విచార‌ణ నిర్వ‌హించాలి

by Ratna Kumari |

పారదర్శకంగా ఫిర్యాదుల విచారణ స్టేషన్ అధికారులు నిర్వహించి భాదితులకు బాసటగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.

పార‌ద‌ర్శ‌కంగా ఫిర్యాదుల‌పై విచార‌ణ నిర్వ‌హించాలి
X

దిశ, నర్సంపేట : పారదర్శకంగా ఫిర్యాదుల విచారణ స్టేషన్ అధికారులు నిర్వహించి భాదితులకు బాసటగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ సీపీ బుధవారం ఈస్ట్ జోన్ పరిధిలోని చెన్నరావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పోలీస్ కమిషనర్ కు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్, ఐటీ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సీపీ సిబ్బందిని పని తీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులతో పాటు, రౌడీ షీటర్లు, అనుమానితుల రికార్డులు, ప్రస్తుతం పెండింగ్ కేసుల రికార్డ్ లకు సీపీ తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుకున్నారు.చివరగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శించి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రతి గ్రామస్తుడు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని,అక్రమ ఇసుక రవాణా, పాఠశాలల పరిసరాల్లో పోగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహారించాలన్నారు. ఈ తనిఖీల్లో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నెక్కొండ సిఐ శ్రీనివాస్ చిన్నరావుపేట, నెక్కొండ ఎస్ఐలు రాకేష్ రెడ్డి, మహేందర్ ఉన్నారు.

Next Story