- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూపాలపల్లి బీఆర్ఎస్‌లో భగ్గుమన్న విభేదాలు
భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటన సందర్భంగా ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారికి సంబంధించిన వ్యవహారంలో రెండు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సింగరేణి పరిరక్షణ సదస్సుకు హాజరుకావాలని ఎమ్మెల్సీ మధుసూదనాచారిని ఆహ్వానించేందుకు టీజీబీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆయన కార్యాలయానికి వెళ్లగా, మధుసూదనాచారి వర్గీయులు "గో బ్యాక్" అంటూ నినాదాలు చేశారు. దీంతో భూపాలపల్లి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహణలో ఎమ్మెల్సీ మధుసూదనాచారికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి ఆయన వర్గీయుల్లో వ్యక్తమైంది. మాజీ స్పీకర్‌కు సరైన గౌరవం ఇవ్వకపోవడంతో పాటు ఆహ్వానించే విధానంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, మధుసూదనాచారి స్వయంగా జోక్యం చేసుకుని తన అనుచరులను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. హరీష్‌రావు పర్యటనకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం పార్టీ అంతర్గత పరిస్థితులను మరోసారి వెలుగులోకి తెచ్చింది. భూపాలపల్లి జిల్లాలో గండ్ర వెంకటరమణారెడ్డి, మధుసూదనాచారి వర్గాల మధ్య కొనసాగుతున్న విభేదాలు బహిర్గతం కావడంతో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.






