హన్మకొండ జిల్లాలో ఔషద అధికారుల తనిఖీలు

by Ratna Kumari |

హన్మకొండ జిల్లాలోని కాజీపేట, ధర్మసాగర్ లో ఔషద తనిఖీ అధికారులు తనిఖీలు బుధవారం నిర్వహించారు.

హన్మకొండ జిల్లాలో ఔషద అధికారుల తనిఖీలు
X

దిశ, హన్మకొండ కలెక్టరేట్ : హన్మకొండ జిల్లాలోని కాజీపేట, ధర్మసాగర్ లో ఔషద తనిఖీ అధికారులు తనిఖీలు బుధవారం నిర్వహించారు. ఏ.డీ. రాజ్యలక్ష్మి, హనుమకొండ డ్రగ్ ఇన్ స్పెక్ట‌ర్ కిరణ్ కుమార్ & వరంగల్ డ్రగ్ ఇన్ స్పెక్ట‌ర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిబంధనలు పాటించని పలు మెడికల్ షాపులకు ఎస్సీఎన్ జారీ చేశారు. వేసవి కాలంలో మందుల భద్రత కొరకు తూచా తప్పకుండా అన్ని మెడికల్ షాపుల్లో పాటించాలని సూచించారు. పాటించని వారిపై డీ& సీ యాక్ట్ 1940 రూల్ 45 ప్రకారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏ.డీ. రాజ్యలక్ష్మి తెలిపారు. ఆర్‌ఎమ్‌పిల చికిత్ససహాయంలో ఏ ఫార్మసీ కూడా పాలుపంచుకోకూడదని ఆమె హెచ్చరించారు.

Next Story