క‌మ‌ల‌ద‌ళంలో అంత‌ర్మథ‌నం

by Naveena |

వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం టీచ‌ర్స్ ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పోరాడాల్సినంత పోరాడ లేదా?, చేయాల్సినంత ప్రయ‌త్నం చేయ‌లేదా?

క‌మ‌ల‌ద‌ళంలో అంత‌ర్మథ‌నం
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం టీచ‌ర్స్ ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పోరాడాల్సినంత పోరాడ లేదా?, చేయాల్సినంత ప్రయ‌త్నం చేయ‌లేదా?.. పార్టీ నేత‌లు ముందు నుంచే చేతులేత్తేసిన‌ట్లు చేయ‌డానికి కార‌ణ‌మేంటి అన్న సందేహాలు ఇప్పుడు రాష్ట్ర పార్టీ నాయ‌క‌త్వాన్ని ఆలోచ‌న‌లో ప‌డేసిన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. పొరుగు జిల్లా క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన టీచ‌ర్స్ ఎమ్మెల్సీ, ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌ను కైవ‌సం చేసుకున్న క‌మ‌ల‌ద‌ళం..న‌ల్గొండ టీచ‌ర్స్ స్థానంలో మాత్రం వెన‌క‌బ‌డిపోయింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థుల‌ను నిలుప‌క‌పోగా.. బీజేపీ మాత్రం త‌మ అభ్యర్థిగా స‌రోత్తంరెడ్డిని బ‌రిలోకి దించింది. దీంతో ఆ పార్టీపై క్యాడ‌ర్‌లో, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ అంచ‌నాలు పెరిగాయి. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌, వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు ప‌ర‌కాల‌, వ‌ర్ధన్నపేట నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓటు బ్యాంకు ఉంద‌నే విష‌యం ప్రస్పుట‌మైంది. ఈ నేప‌థ్యంలో విద్యావంతులు, మేధావి వ‌ర్గం తీర్పుగా భావించే టీచ‌ర్స్ ఓట్లను సాధించ‌వ‌చ్చేనే అభిప్రాయం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉండేది. న‌ల్గొండ టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోనే అత్యధిక ఓట్లు క‌లిగి ఉండ‌డం గ‌మ‌నార్హం. అందుకు వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌లోనే అత్యధికం. దీంతో గెలుపు కోసం ప్రయ‌త్నం జ‌ర‌గ‌డ‌మే కాదు.. ఉనికైన చూపుతుందన్న ధీమా ఆ పార్టీ క్యాడ‌ర్‌లో క‌నిపించింది. అయితే అందుకు విరుద్ధంగా ఫ‌లితాలు రావ‌డంపై ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వం లోపాలు, త‌ప్పిదాల‌ను అన్వేషించే ప‌నిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఉనికైనా చాటుకోలేక పోయామే..?!

మొద‌టి ప్రాధాన్య ఓట్లలో పీఆర్‌టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డికి 6035ఓట్లు రాగా, యూటీఎఫ్ టీఎస్ అభ్యర్థి అలుగుబెల్లి న‌ర్సిరెడ్డికి 4820ఓట్లు వ‌చ్చాయి. కాంగ్రెస్ నేత‌, టీపీఆర్‌టీయూ అభ్యర్థి గాలిరెడ్డి హ‌ర్షవ‌ర్ధన్‌రెడ్డికి 4437ఓట్లు వ‌చ్చాయి. బీసీ సంఘాల జేఏసీ, ఎస్టీయూ మ‌ద్దతుతో బ‌రిలో నిలిచిన పూల ర‌వీంద‌ర్‌కు 3115ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్యర్థిగా బ‌రిలో నిలిచిన పులి స‌రోత్తంరెడ్డికి 2289ఓట్లు వ‌చ్చాయి. మొద‌టి ప్రాధాన్య ఓట్లు సాధించ‌డంలో బీజేపీ అభ్యర్థి 5వ స్థానంలో నిలిచారు. మిగ‌తా అభ్యర్థులంతా కూడా ఉపాధ్యాయ సంఘాల మ‌ద్దతు మాత్రమే బ‌రిలో నిల‌వ‌గా.. పులి స‌రోత్తంరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా బ‌రిలో నిలిచారు.

Next Story