- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థిని పై అమానుష వైఖరి
నరసింహులపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దిశ, నరసింహుల పేట : నరసింహులపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన అమానుష సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న భానోత్ సుహాని అనే బాలికను అసంబద్ధంగా కర్రతో కొట్టడంతో ఆ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తరువాత విద్యార్థిని తల్లిదండ్రులు తెలియజేశారు. వైద్యుల సూచనల మేరకు ఈ నెల 8 వ తేదీ నుంచి కొంతకాలం విశ్రాంతి తీసుకున్న విద్యార్థిని అనంతరం తిరిగి మంగళవారం స్కూల్‌కు తన తాత తో హాజరైంది. స్కూల్‌కు వచ్చినప్పటికీ, స్కూల్ ప్రిన్సిపాల్‌తో పాటు మ్యాథ్స్ టీచర్ రజని ఆమెను లోపలికి అనుమతించకుండా మూడు గంటలపాటు స్కూల్ గేట్ బయటే నిలబెట్టడం సంచలనంగా మారింది.
తీవ్ర ఎండలో, మానసిక ఒత్తిడితో బాలిక బయటే వేచిచూడాల్సి రావడం విద్యా వ్యవస్థపై ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు “బాలికల రక్షణ, విద్యా హక్కులు” అంటూ ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇలాంటి అమానుష ఘటనలు చోటు చేసుకోవడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, బాలికకు న్యాయం చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.






