- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదలకు కేటాయించాలి : మంత్రి పొన్నం
మండలం లోని కొత్త కొండ గ్రామంలో గురువారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58వ పుట్టినరోజు సందర్భంగా వీరభద్రుడిని దర్శించుకున్నారు.

దిశ, భీమదేవరపల్లి : మండలం లోని కొత్త కొండ గ్రామంలో గురువారం రోజున మంత్రి పొన్నం ప్రభాకర్ తన 58వ పుట్టినరోజు సందర్భంగా వీరభద్రుడిని దర్శించుకున్నారు. వేద పండితులు దైవ సన్నిధిలో ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో పుట్టినరోజు కేక్ కట్ చేస్తూ వేడుకలను పంచుకున్నారు. ఈసందర్భంగా పాత్రికేయులతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2014- 23 మధ్య గత 10 సంవత్సరాల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి 1237 డబుల్ బెడ్ రూం లు సంక్షన్ చేయగా అందులో 443 మాత్రమే ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ 443 లో 243 అప్పటి సీఎం ముల్కానూరు లో ఇల్లు కోలగొట్టబడి కేటాయించిన ఇల్లు 200 అని పేర్కొన్నారు. గడిచిన 10 ఏళ్లలో నియోజకవర్గంలోని మండలాల్లో భీమదేవరపల్లి, సైదాపుర్, ఎల్కతుర్తి, కొహెడ, అక్కన్నపేట లో సున్నా ఇల్లు కట్టారు.
హుస్నాబాద్ లో 163 ఇల్లు నిర్మించారు. 20 ఇల్లు సైదాపూర్ లో నిర్మాణంలో ఉన్నాయని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. వీటిని పేదలల్లో పేదలకు ఇవ్వాలని నిర్ణయించాం. వచ్చే రెండు నెలల్లో మళ్ళీ 3500 ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుంది. గ్రామాల్లో అర్హుల పేర్లు డిస్ ప్లే చేయాలి. క్షేత్ర స్థాయిలో ఈ పథకం అర్హులకు చేరాలని. అన్యాయం జరిగితే చర్యలు తప్పవన్నారు. ఇళ్ల ఎంపిక వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు ఉపయోగపడాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలో భూ భారతి మోడల్ గా అక్కనపేట మండలం ఎంపిక అయింది. సన్న బియ్యం పంపిణీ జరుగుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లాలో కొత్తగా 46 వేల మందికి రేషన్ ద్వారా సన్న బియ్యం వచ్చాయన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.






