ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

by Bhanu |

ఆదివారం పరకాల పట్టణంలోని 8వ వార్డులోని సీతారాంపురం, 9వ వార్డులోని బస్టాండ్ దగ్గర,13వ వార్డులోని సి ఎస్ ఐ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమంలో పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
X

దిశ, పరకాల : ఆదివారం పరకాల పట్టణంలోని 8వ వార్డులోని సీతారాంపురం, 9వ వార్డులోని బస్టాండ్ దగ్గర,13వ వార్డులోని సి ఎస్ ఐ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్ళ భూమి పూజ కార్యక్రమంలో పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి, ఇంటినిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను అందజేసిన ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ,అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు.


పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లబ్ధిదారులకు విడుదలవారీగా రూ 5లక్షలు అందజేయడం జరుగుతుందని అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు.ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని తెలిపారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామం,లో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం,లో వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.



Next Story