- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ మార్కెట్ లో పెరుగుతున్న మిర్చీ ధర
వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చీ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా వండర్ హాట్ రకానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది.

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చీ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా వండర్ హాట్ రకానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ మార్కెట్ లో ఈ రకానికి బుధవారం క్వింటాలు రూ.37,100 పలుకగా.. గురువారం ఏకంగా రూ.900 ధర పెరిగి రూ.38వేలకు అమ్మకాలు జరిగాయి. వండర్ హాట్ తో పాటు యూఎస్ 341కు కూడా ధర పెరిగింది. ఇతర మిర్చీ రకాలకు కూడా ఎక్కువ ధరకు అమ్ముడు అవుతున్నాయి. మార్కెట్ లో గురువారం వండర్ హాట్ కు సరాసరి కనిష్ట ధర 14,500 రూపాయలు పలుకగా, గరిష్ట ధర క్వింటాలుకు 38వేల రూపాయలు పలికింది. మోడల్ ధర క్వింటాలుకు 28వేల రూపాయల వరకు ఉంది. తేజా మిర్చీకి కనిష్ట ధర 11,500 రూపాయలు ఉండగా.. గరిష్ట ధర 19,500 రూపాయలు పలికింది. యూఎస్ 341కు కనిష్ట ధర రూ.12,500 రూపాయలు ఉండగా.. గరిష్ట ధర రూ. 26,700 రూపాయలు పలికింది. మిర్చీ మార్కెట్ కు గురువారం 5050 బస్తాలు వచ్చింది. మిర్చీకి ధర పెరుగుతుండటం వల్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






