Medaram Jatara 2026: జనమంత జాతరలోనే.. పనిచేయని VIP, VVIP పాసులు

by Ajay Maddhiboyina |

మేడారంలో వీఐపీల తాకిడి పెరిగింది. వీవీఐపీ, వీఐపీ పాసులు ఎక్కువగా జరిచేయడంతో ఆ లైన్ కూడా సాధారణ లైన్‌ లాగా కనిపిస్తుంది.

Medaram Jatara 2026: జనమంత జాతరలోనే..  పనిచేయని VIP, VVIP పాసులు
X

దిశ మేడారం న్యూస్ నెట్ వర్క్/ దిశ మేడారం: ప్రపంచ జనమంతా మేడారం జాతరలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. మేడారం గ్రామంలో శుక్రవారం అడుగు తీసి అడుగు వేయని పరిస్థితి నెలకొంది. నిండు జాతర ప్రారంభం కావడంతో తండోపతండాలుగా భక్తులు నాలుగు వైపుల నుండి మేడారం చేరుకొని దర్శనాల కోసం బారులు తీరుతున్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద రాజు, గోవిందరాజు, నాగులమ్మ గద్దెలపై కొలువు తీరడంతో దర్శనానికి పోటీ పడుతున్నారు. భక్తుల తాకిడి అధికం కావడంతో అధికారులు వీఐపీ, వీవీఐపీ పాసులను రద్దుచేసి అన్ని సాధారణ దర్శనాలకే అవకాశం కల్పిస్తున్నారు.

Next Story