మిర్యాల పెంట‌లో గాలి దుమారానికి నేల వాలిన మ‌క్క‌లు

by Ratna Kumari |

మిర్యాల‌పెంట‌లో గాలి దుమారానికి మ‌క్క‌లు నేల‌వాలాయి. ముఖ్యంగా బుధ‌వారం ఏజెన్సీ ప్రాంత‌మైన గంగారం-బ‌య్యారం స‌రిహ‌ద్దు ప్రాంతంలో సాయంత్రం గాలి దుమారం, వ‌డ‌గండ్ల వ‌ర్షంతో నోటికాడికి వ‌చ్చిన మొక్క‌జొన్న పై ప‌లువురు రైతులు పంట‌లు నేల‌వాలిన‌ట్టు తెలిపారు.

మిర్యాల పెంట‌లో గాలి దుమారానికి నేల వాలిన మ‌క్క‌లు
X

దిశ‌, బ‌య్యారం : మిర్యాల‌పెంట‌లో గాలి దుమారానికి మ‌క్క‌లు నేల‌వాలాయి. ముఖ్యంగా బుధ‌వారం ఏజెన్సీ ప్రాంత‌మైన గంగారం-బ‌య్యారం స‌రిహ‌ద్దు ప్రాంతంలో సాయంత్రం గాలి దుమారం, వ‌డ‌గండ్ల వ‌ర్షంతో నోటికాడికి వ‌చ్చిన మొక్క‌జొన్న పై ప‌లువురు రైతులు పంట‌లు నేల‌వాలిన‌ట్టు తెలిపారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కల ధాన్యం తడిసి ముద్దయినట్లు సమాచారం. గ్రామంలో చెట్లు విరిగి పడటంతో విద్యుత్ కి తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. గాలి దుమారానికి విద్యుత్తు అంతరాయంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్ సిబ్బంది విద్యుత్ లైన్ పునర్దన పనులు వేగవంతం చేసినట్లు సమాచారం.

Next Story