ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుంది

by Ratna Kumari |

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుంది
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుంది అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్ పరిధి లోని తరాలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అరుణ - వెంకటేష్ దంపతులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నుంచి కేటాయించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఆ నివాసానికి శుక్రవారం కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి అర్థంగాబడే ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన సింగారపు అరుణ - వెంకటేష్ కు నూతన వస్త్రాలు పెట్టి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ ద్వేయం” అని పేర్కొన్నారు.

గత పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అని చెప్పి పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు నిజమైన న్యాయం జరుగుతోందని స్పష్టం చేశారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే నాగరాజు ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్ర హరీష్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎం.డి బషీర్, డివిజన్ నాయకులు నర్మెట్ట వెంకటరమణ గౌడ్, సదానందం, శ్రీనివాస్ రెడ్డి, నీలం రజినీ, గుర్రం జ్యోతి బస్కే ప్రణయ్, కృష్ణ , నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story