నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు..

by Kodari Anjali |

టేకుమట్ల మండలంలో కలికోట గ్రామపంచాయతీ మానేరు వాగు నుండి ఇష్టానుసారంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు..
X

దిశ, టేకుమట్ల: టేకుమట్ల మండలంలో కలికోట గ్రామపంచాయతీ మానేరు వాగు నుండి ఇష్టానుసారంగా టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. చలి వాగు ప్రవహిత ప్రాంతాలైనటువంటి వెలిశాల బుర్నపల్లి ఆసిరెడ్డిపల్లి రాఘవరెడ్డి పేట గ్రామాల్లో ఆనుకొని ఉన్న చలివాగులో ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇసుక దందా ఆరు గంటల సమయం దాటిన కొనసాగుతోందని అధికారుల నిర్లక్ష్యంతో ఇసుక విచ్చలవిడిగా పట్టణ ప్రాంతాలకు ఇందిరమ్మ గృహాల పేరుతో తరలిస్తున్నారని జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ స్పందించి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. ఇసుక దందాను అరికట్టాలని అన్నారు. కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి పేరిట ఇష్టానుసారంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అయినప్పటికీ మండల ప్రభుత్వ అధికారులు స్పందించిన దాకాలు కానరావడం లేదు. తక్షణమే ఇసుక దందాను అరికట్టాలని అక్రమంగా తరలిస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.. రాత్రి 9 అయిన ఇసుక మండలం నుంచి టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా తరలిపోతున్న కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక దందా కొనసాగుతుందని అన్నారు. తక్షణమే అరికట్టాలని కోరుతున్నాం ఇంత విచ్చలవిడిగా సహజ సంపదను చూసి కూడా జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేయకూడదని కోరారు.

Next Story