'ఓజీ 1'లో లోపం.. 'ఓజీ 2'లో అదే బలంగా మారనుందా?

by Pulgam srinivas |

'ఓజీ 2' కోసం కథపై ప్రత్యేక ఫోకస్.. తొలి భాగం తప్పిదాలు రిపీట్ కాకుండా సుజిత్ ప్లాన్.

ఓజీ 1లో లోపం.. ఓజీ 2లో అదే బలంగా మారనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'ఓజీ' చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ, అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల అంచనాలను మాత్రం పూర్తిగా అందుకోలేకపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్, విజువల్స్‌కు ప్రశంసలు దక్కినా, కథ విషయంలో విమర్శలు ఎదుర్కొంది. ఇదిలా ఉంటే, త్వరలోనే 'ఓజీ 2' ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్శకుడు సుజిత్ ఈసారి కథపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి పవన్ కళ్యాణ్‌కు వినిపించగా, ఆయన కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తొలి భాగంలో వచ్చిన కథాపరమైన విమర్శలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వార్తలు పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ఇక ఓజీ మొదటి భాగంలో ప్రియాంక అరుల్ మోహన్, పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి జంటకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర ముగిసింది. దాంతో 'ఓజీ 2' లో చిత్రంలో ఎవరు హీరోయిన్గా నటించబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రస్తుతం సుజిత్ పలువురు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కోసం వెతుకులాట ప్రారంభించినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ చిత్రంలో ఎవరు హీరోయిన్గా నటిస్తారో చూడాలి.

Next Story