- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలోనూ లోపాలున్నాయి.. కానీ ఇకపై నా ప్రయాణం ప్రజల కోసమే.. విశాల్ సంచలన వ్యాఖ్యలు
ఇన్ని సంవత్సరాలుగా సినీ రంగంలో ఉంటూ ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందిన తాను, ఈ వయసులో సమాజం కోసం, ప్రజల కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకుంటున్నట్లు వెల్లడించారు

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ‘మకుటం’ సినిమాతో దర్శకుడిగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు హీరోగా వైవిధ్యమైన పాత్రలో నటించి తన నటనతో అందరినీ మెప్పించిన ఆయన.. ‘ముకటం’లో మూడు పాత్రలో నటిస్తూ.. తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తమిళంలో మగుడం పేరుతో రాబోతుంది. ఇందులో దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విశాలక కెరీర్‌లో 35వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా..ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. బలమైన యాక్షన్ అంశాలతో జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విశాల్ పాల్గొని, తన మనసులోని మాటను, భవిష్యత్తుపై ఆయనకున్న క్లారిటీని ఎంతో నిజాయితీగా పంచుకున్నారు. తనలో కూడా లోపాలు ఉన్నాయని, తప్పులు లేవని తాను ఎప్పుడూ చెప్పనని విశాల్ నిజాయితీగా అంగీకరించారు.
అయితే ఇన్ని సంవత్సరాలుగా సినీ రంగంలో ఉంటూ ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందిన తాను, ఈ వయసులో సమాజం కోసం, ప్రజల కోసం ఏదైనా చేయాలని బలంగా అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మాటలను తాను ఏదో గిల్ట్‌తోనో లేదా అపరాధ భావంతోనో చెప్పడం లేదని, సమాజం పట్ల ఒక పూర్తి బాధ్యతతోనే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. అయితే ఇకపై తాను ఎంచుకోబోయే మార్గం అంత సాధారణమైనది కాదని, అది చాలా సూటిగా, స్పష్టంగా ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. ఆ నిజాయితీ గల మార్గంలో పయనిస్తున్నప్పుడు ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన తదుపరి రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. విశాల్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారని.. ఈ కామెంట్స్‌తో ఈ విషయంపై హింట్ ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.






