- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాందారిపేట గుట్టల్లో అక్రమ తవ్వకాలు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధిలోని పెద్ద కొడేపాక రెవెన్యూ శివారులోనీ సర్వే నంబర్ 632 మాందారిపేట గుట్టల్లో అక్రమంగా మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధిలోని పెద్ద కొడేపాక రెవెన్యూ శివారులోనీ సర్వే నంబర్ 632 మాందారిపేట గుట్టల్లో అక్రమంగా మొరం తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం.. రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ తవ్వకాల కారణంగా గుట్టల సహజ ఆకృతి మారిపోతుండటమే కాకుండా పరిసర వ్యవసాయ భూములు, చెట్లు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో అనుమతులు లేకుండా జరుగుతున్న తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర హానికరమని పలువురు పేర్కొంటున్నారు. అదనంగా రాత్రివేళల్లో భారీ వాహనాల రాకపోకలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ రహదారులు కూడా దెబ్బతింటున్నాయని అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ అక్రమ మట్టి తవ్వకాల్లో మండలానికి చెందిన కొంతమంది బడా నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. గుట్టలను పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.
తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు : తహశీల్దార్ ప్రవీణ్ కుమార్
ఈ విషయంపై స్థానిక తహశీల్దార్ ని దిశ ప్రతినిధి వివరణ కోరగా.. మండల పరిధిలో మొరం తవ్వకాలకు ఎలాంటి అధికారిక అనుమతులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా ఎవరైనా తవ్వకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






