- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూటు మార్చి లోడూ పెంచి.. రాత్రి సమయంలో గోదావరి దాటిస్తున్న వైనం..
పశువులను అక్రమంగా కభేళాలకు తరలించి సోమ్ము చేసుకునే అక్రమార్కులు బరి తెగిస్తున్నారు.

దిశ, ఏటూరునాగారం: పశువులను అక్రమంగా కభేళాలకు తరలించి సోమ్ము చేసుకునే అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. పోలిస్ అధికారులు పట్టుకుని వారిపై కేసులు నమోదు చేసిన కేసులు మాకు షరా మూమూలే అన్నట్లుగా అదే అక్రమ వ్యాపారాన్ని యదేచ్చంగా కొనసాగిస్తూ చీకటి వ్యాపారంతో లక్షల రూపాయాలు అర్జిస్తున్నారు. రూటు మార్చి, లోడూ పెంచి పశువులను అక్రమంగా కభేళాలకు తరలిస్తూ సంభందిత శాఖ అధికారులకు చిక్కకుండా మస్కా కొడుతున్నారు. ముందుగానే ఏంచుకున్న కొత్త మార్గాల గుండా పశువులను అక్రమంగా తరలిస్తూ పోలిసులకు పట్టుబడకుండా ప్రణాళికగా చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నారు. పశువులను అక్రమంగా తరలించే వారి పై పోలిస్ అధికారులు దృష్టి సారించడంతో తనిఖీలు లేని కొత్త మార్గాల గుండా పశువులను అక్రమంగా తరలిస్తూ అక్రమ దందాను మూడు పువ్వులు ఆరు కాయాలుగా కొనసాగిస్తున్నారు. గ్రూపులు గా ఏర్పడి పెద్ద వాహనాలకు ఒక బృందం, చిన్న వాహనాలకు ఒక బృందం అధిపత్యం వహిస్తూ పశువులను అక్రమంగా జిల్లాల సరిహద్దులను దాటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాత్రికి రాత్రే గోదావరి దాటిస్తున్న వైనం..
వేసవి కాలం అక్రమ పశు వ్యాపారులకు కలిసోస్తుంది. తీవ్ర ఏండల కారణంగా గోదావరిలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ, చత్తీస్‌ఘడ్,మహరాష్ట్ర సరిహద్దు గోదావరి తీర ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకుని పశువులను కాలినడకన అక్కడకి తరలిస్తున్నారు.గోదావరి తీర ప్రాంతాల స్థావరాల వద్ద నుండి కంటైనర్,డీసీఏం,అశోక్ లీ ల్యాండ్ బోలేరో వంటి వాహనాలలో నిబంధనలను ఉల్లాఘంచి పశువులను వయా..వెంకటాపురం,వాజేడు మీదుగా ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట బ్రిడ్జి నుంచి రొయ్యూరు, కన్నాయిగూడెం,మండలం మీదుగా ప్రయాణిస్తూ లక్ష్మిపురం వద్ద దారి మళ్లించి భూపాలపల్లి జిల్లా మార్గం ద్వారా హైదరాబాద్ కభేళాలకు తరలిస్తున్నారు. మరోక మార్గం అయిన ఏటూరునాగారం వై జంక్షన్ నుండి రామన్నగూడెం మీదుగా మంగపేట, కోమటి పల్లి, కొత్తూరు మొట్లగూడెం, కాటాపూర్ నుండి తాడ్వాయి ఊరి చివరి గల రహదారి గుండా పశువుల వాహనాలను గమ్య స్థానాలకు చెరవేస్తున్నారు.
గ్రూపులుగా ఏర్పడి దందా..దాటించడంలో అ గ్రూపు దిట్టా..
పశువులను అక్రమంగా రవాణా చేయడంలో కంటైనర్, బోలేరో,డీసీఏం వాహనాల యజమానులు మూడు గ్రూపులు ఏర్పడి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇటీవల పోలీసులు వరుసగా కంటైనర్, డీసీఏం వాహనాలను పట్టుకుని సీజ్లు చేయడంతో భారీ వాహనాల వ్యాపారం కాస్త తగ్గినట్లుగా సమాచారం. బోలేరో వాహనా దారుల అక్రమ పశు రవాణా నిత్యకృతం అయింది. రోజు రాత్రులు 10 గంటల తర్వాత మొదలయ్యే అక్రమ పశు రవాణా ఉదయం 7 గంటల వరకు యదేచ్చంగా వెంకటాపురం,వాజేడు, ఏటూరునాగారం, తాడ్వాయి,పస్రా, ములుగు మీదుగా తరలుతూనే ఉండడం గమనార్హం. ఇదీలా ఉండగా పశువులను తరలిస్తున్న వాహనాలను క్షేమంగా వాటి గమ్య స్థానాలకు చేర్చడం కోసం మండలంకు చెందిన ఒక గ్రూపు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఈ గ్రూపు బోలేరోకు 3000రూ, డీసీఏం కు 5000రూ, కంటైనర్ కు 6500రూపాయాలు వసూలు చేస్తూ వాహనాలను క్షేమంగా చెక్‌పోస్టులు దాటిస్తున్నారు. ఏవరైన ఈ గ్రూపుకు వాహన దాటింపు రుసుము కట్టకపోతే ఈ గ్రూపు కు చెందిన వ్యక్తులే పోలీసులకు సమాచారం అందేలా చేసి పశువులను దాటిస్తున్న వాహనాలను పట్టుకునేలా చేయడంలో దిట్టగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కేసులు పెట్టిన అగం..అలవాటు పడిన ప్రాణం..
పశువులను అక్రమంగా రవాణా చేసే వ్యాపారులు కేసులు పెట్టిన అగం..అలవాటు పడిన ప్రాణం అన్నట్లుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల తాడ్వాయి పోలీసులు ఒకసారి 5 బోలేరోలు, మరో సారి 2 బోలేరోలు పట్టుకుని పశువులను తరలిస్తున్నవారిపై కేసులు నమోదు చేశారు. అలాగే గడిచిన నాలుగు రోజుల వ్యవదిలో నూగూరు వెంకటాపురం గ్రామ సమీపంలో డీసీఏం,బోలేరో వాహనంలో పశువులను తరలిస్తుండగా అ గ్రామానికి చెందిన యువకులు వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించిగా పశువులను తరలిస్తున్న వారిపై అక్కడ కేసులు నమోదు అయ్యాయి. ఇంతలా పోలిస్ అధికారులు అక్రమ పశు రవాణా వ్యాపారులను పట్టుకుని వారిపై కేసులు నమోదు చేస్తున్న వీరి అక్రమ వ్యాపారం మాత్రం అగడం లేదు..
అగని అక్రమ దందా..
యదేచ్చంగా కొనసాగుతున్న పశు రవాణా వ్యాపారం పై నిరంతరం అయా మండలాల పోలిస్ అధికారులు దృష్టి సారిస్తున్న అక్రమ రవాణా వ్యాపారం నిత్యకృతంగా కొనసాగుతుంది. జిల్లా ఉన్నతాదికారులు దృష్టి సారించి కఠిన మైన చర్యలు చేపడితేనే అక్రమ రవాణా అరికట్ట వచ్చు అని ప్రజలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దిశకు వివరణ ఇచ్చిన ఏటూరునాగారం ఏస్సై తాజుద్దీన్..
పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లా ఏస్పీ శభరీష్ అదేశాల మేరకు నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ పశు రవాణా పై చేసే వారి పై ప్రత్యేక దృష్టి సారించం. పశువులను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన వారి పై ఇప్పడి వరకు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏవరైన పదే పదే అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే ఇక పైన వారి పైన మరింత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.






