- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అబద్ధాలు ప్రచారం చేస్తే.. ఖబడ్దార్
అబద్ధాలు ప్రచారం చేస్తే.. ఖబడ్దార్ ఊరుకునేదే లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.

అబద్ధాలు ప్రచారం చేస్తే.. ఖబడ్దార్
- నేను నటినైతే.. మీరు పెయిడ్ ఆర్టిస్టులా?
- ఎమ్మెల్యే నీ ఉద్యోగం ఊడే రోజులు దగ్గరపడ్డాయి
- మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
దిశ,డోర్నకల్(కురవి): అబద్ధాలు ప్రచారం చేస్తే.. ఖబడ్దార్ ఊరుకునేదే లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. మంగళవారం కురవి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళి నాయక్ లపై విమర్శలు ఎక్కుపెట్టారు. నన్ను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడడం సంతోషమన్నారు. తను నటిని అయితే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అని ప్రశ్నించారు. యూరియా కోసం క్యూలైన్ లో నిల్చుంటే పది బస్తాలు ఇచ్చారని చెబుతున్నారు. యూరియా తీసుకుంటే కూపన్ అధికారుల దగ్గర ఎందుకుంటుందని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడానికి సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరభద్ర స్వామిపై ప్రమాణం చేస్తా.. లేనిచో రామచంద్రు నాయక్, మురళీ నాయక్ లు ముక్కు నెలకు రాయాలి. చిల్లర వేషాలు వేయొద్దని హితవు పలికారు. జిల్లా కేంద్రంలో కేసీఆర్ నిర్ణయం మేరకు నూకల రామచంద్రా రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లయినా ఆవిష్కరణకు మోక్షం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు హరిగోస పడుతుంటే భరోసా కల్పించలేని ప్రజాప్రతినిధులు ఉన్నారు. రామచంద్రునాయక్ ని ఉద్యోగం ఊడే రోజులు దగ్గర పడ్డాయని ఆరోపించారు. సోయుంటే ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు.






