మత్తుకు బానిస అయితే జీవితం అంధకారమే : ఈగల్ ఫోర్స్ సీఐ శ్రీకాంత్

by Ratna Kumari |

విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితం అంధకారం అవుతుందని ఈగల్ పోర్స్ సీఐ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా పలు గ్రామాలలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన, ర్యాలీ నిర్వహించారు.

మత్తుకు బానిస అయితే జీవితం అంధకారమే : ఈగల్ ఫోర్స్ సీఐ శ్రీకాంత్
X

దిశ, లింగాల ఘన‌పురం : విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలు అయితే జీవితం అంధకారం అవుతుందని ఈగల్ పోర్స్ సీఐ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా పలు గ్రామాలలో మత్తు పదార్థాలు, డ్రగ్స్ నిర్మూలన పై విద్యార్థులకు అవగాహన, ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ చుట్టు ప్రక్కల ఎవరైనా డ్రగ్స్, గంజాయి లాంటి పదార్థాలు విక్రయించిన వెంటనే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులు, పోలీసుల అధికారులకు తెలియజేయాల‌న్నారు. తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే వారిపై చర్యలు అనంతరం విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్ర‌మంలో తహసీల్దార్ రవీందర్ ఎస్సై శ్రవణ్ కుమార్, ఇన్ చార్జి ఎంపీడీవో సీతారామ నాయుడు, ఎంఈఓ విష్ణు మూర్తి, వైద్య అధికారి స్వర్ణలత, సర్పంచులు ఎడ్ల లావణ్య, నర్సింగ రామకృష్ణ, కార్తీక్, రాజు, డైరెక్టర్ బి.శ్రీలత రెడ్డి, ఉప్పసర్పంచ్ రాజయ్య, ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story