- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే ఢిల్లీదే పెత్తనం : ఆరూరి రమేష్
దిశ, వర్ధన్నపేట: కాంగ్రెస్ బీజేపీలకు ఓటేస్తే ఢిల్లీదే పెత్తనమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా లోని 43 44 45 డివిజన్ల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూబిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదనీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారెంటీ కార్డును ప్రజలు నమ్మవద్దని తెలిపారు. గతంలో ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ హయాంలో మంచినీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయిందో ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు.
ఆచరణకు సాధ్యం కానీ హామీల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పాలని తెలిపారు. బాధ్యతాయుతమైన బిఆర్‌ఎస్ పార్టీ మేనిఫెస్టోతోనే ప్రజలకు భరోసా అన్నారు. మన సమస్యలు మనమైతేనే పరిష్కరించుకో గలుగుతాం, మన కారు గుర్తుకు ఓటేసి మన సారును గెలిపించుకొని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా ఆదరిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కేసీఆర్, కేటీఆర్ ల సహకారంతో వర్దన్నపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.