- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, హనుమకొండ టౌన్ : హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేష్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. వెంటనే రాజేష్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని వారి కుటుంబ సభ్యులను ఆయన కోరారు. వెంటనే కలెక్టర్ ప్రావిణ్య, సీఎం ఆఫీసుతో ఆయన మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి త్వరితగతిన తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
Next Story






