భారీగా నల్లబెల్లం స్వాధీనం…

by Disha Web Desk 11 |
భారీగా నల్లబెల్లం స్వాధీనం…
X

దిశ, డోర్నకల్ : అశోక్ లేలాండ్ వాహనం లో అక్రమంగా రవాణా చేస్తున్న సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, స్పటికం ను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ కథనం ప్రకారం.. డోర్నకల్ మండల కేంద్రం బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఇన్స్పెక్టర్ సంతోష్ రావు వాహనాలు తనిఖీ చేస్తుండగా లేలాండ్ వాహనం లో సారా తయారీకి ఉపయోగించే బెల్లం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా అశోక్ లేలాండ్ లో ఉన్న 20 క్వింటాళ్ల నల్ల బెల్లం, క్వింటా స్పటికంస్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురు వ్యక్తులు వాహనం వదిలి పెట్టి పారిపోవుటకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకొని రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సైదులు, పాషా, రవి, తదితరులున్నారు.

Read More..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..



Next Story

Most Viewed