- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా ఎలా జెండా ఎగురేశారు..?
స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇలా ఏదైనా అక్కడ ప్రత్యేకత. కానీ ఇవాళ మాత్రం ఆనవాయితీని తప్పారు.

దిశ, వెంకటాపురం (నూగూరు) : గతం ఎంతో వైభవం. చరిత్ర కలిగిన నూగూరు తాలూకా కేంద్రం వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ జెండా ఆవిష్కరణకి ఎంతో ప్రత్యేకత ఉంది. జమిందర్ వ్యవస్థ నుంచి నేటి వరకు తాలూకా కేంద్రంలో జెండా ఆవిష్కరణ అంటే మిగతా ప్రభుత్వ కార్యాలయాలుతో పాటు, మేజర్ పంచాయతీ, అన్ని రాజకీయ పార్టీ దిమ్మలు వద్ద ముందుగా వారు ముగించుకొని త్వరగా తహశీల్దార్ కార్యాలయంకి సరైన సమయానికి చివరిగా అందరు ఇక్కడకి చేరుకుంటారు. అది స్వాతంత్య్ర దినం అయిన, రిపబ్లిక్ డే అయిన, రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన దీనితో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎసై ర్యాంక్ తో కూడిన ఫోర్స్ సైతం ఇక్కడ జెండా వందనం కార్యక్రమంలో పాల్గొనడం ఎప్పటి నుంచో వచ్చే ఆనవాయితీ.
కానీ ఈరోజు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న తహశీల్దార్ నేడు నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు పాత పద్ధతులకి భిన్నంగా ఇద్దరి, ముగ్గురితో తూతూ మంత్రంగా ఎవరు అక్కడికి చేరుకోకుండా జెండా ఆవిష్కరణ నిర్వహించడం చర్చనీయంశంగా మారింది. అధికారులకి జిల్లా కేంద్రంలో పని ఉంది అనే నెపంతో ఇలా చేయడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు, అక్కడకి జెండా వందనం కి వచ్చే వారు అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఎప్పటిలాగే అక్కడికి చేరుకోవడంతో అప్పటికే జెండా ఆవిష్కరణ కావడంతో నిరాశగా వెనుదిరగడం కనిపించింది. ఇంతకు ముందు ఇక్కడ విధులు నిర్వర్తించిన అధికారులు జిల్లా కేంద్రంలో అదే రోజు పని ఉన్న ఇలా ఎప్పుడు తూ తూ మాత్రంగా చేతులు దులుపుకునే విధంగా జెండా ఆవిష్కరణ ఎన్నడు జరగలేదు అని కొందరు చర్చించుకున్నారు. వైభవంగా ఇక్కడ జరగాల్సిన జెండా వదనం, ఆనవాయితీ కళ తప్పకుండా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






