తమకు హామీలు నెరవేర్చకుండానే పనులు ఎలా..?

by Ratna Kumari |

మార్కెట్ యార్డ్ నిర్మాణానికి సంబంధించిన భూమి చదును పనులను రైతులు అడ్డుకుని, తమకు హామీ ఇచ్చిన ఫ్లాట్లు కేటాయించిన తరువాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.

తమకు హామీలు నెరవేర్చకుండానే పనులు ఎలా..?
X

దిశ, ములుగు : మార్కెట్ యార్డ్ నిర్మాణానికి సంబంధించిన భూమి చదును పనులను రైతులు అడ్డుకుని, తమకు హామీ ఇచ్చిన ఫ్లాట్లు కేటాయించిన తరువాతే పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా వంటిమామిడి కూరగాయల మార్కెట్‌ కు ఎదురుగా ఉన్న స్థలానికి మార్పిడి చేయడానికి అధికారులు భూమి చదును పనులు చేపట్టగా.. రైతులు ఆందోళనకు దిగిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ములుగు మండలంలోని వంటి మామిడి మార్కెట్ యార్డ్‌కు ఎదురుగా ఉన్న భూమిలో పనులు ప్రారంభించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు రైతుల నుంచి సుమారు 82 ఎకరాల భూమిని సేకరించి, ఎకరాకు రూ.8.50 లక్షల చొప్పున పరిహారం చెక్కుల రూపంలో చెల్లించారు. అదనంగా మార్కెట్ అనుకోని ఉన్న 20 ఎకరాల భూమిలో ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, అవి ఇప్పటివరకు అమలు కాలేదని రైతులు తెలిపారు.

ఆ 20 ఎకరాల భూమిలో కూడా ప్లాట్లు చేయలేదని రైతులు తమ గ్రామంలోని ఇళ్ల‌కు సమీపంలో ప్రభుత్వ భూమిని కేటాయించాలన్నారు. మా ఇళ్ల స్థలాలకు ప్లాట్లు చూపించిన అనంతరం పనులు ప్రారంభించాల‌ని వ్యతిరేకిస్తూ రైతులు రాజీవ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, ములుగు తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎస్సై రఘుపతి ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారం రోజుల్లో పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కూడా రైతులు ఆందోళన కు విరమించకపోవడం తొ రైతులను పోలీస్ లు స్టేషన్ కు తరలించారు. ప్ర‌భుత్వ హామీ ప్ర‌కారం.. భూమి కోల్పోయిన ప్ర‌తి రైతుకు 250 గ‌జాలు ఇంటి స్థ‌లాన్ని కేటాయించిన త‌రువాతనే ప్ర‌భుత్వం మార్కెట్ ప‌నులు చేప‌ట్టాల‌ని లేకుంటే ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు

Next Story