మహమూద్‌పట్నం ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

by Bhanu |

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ పడింది. రిజర్వేషన్లపై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఈ నెల 29వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియపై స్టే విధించింది.

మహమూద్‌పట్నం ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
X

దిశ, కేసముద్రం : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని మహమూద్‌పట్నం గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్ పడింది. రిజర్వేషన్లపై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఈ నెల 29వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియపై స్టే విధించింది. మహమూద్‌పట్నంలో మొత్తం 576 ఓటర్లు ఉన్నారు. అందులో ఎస్సీలు-199, బీసీలు-358, ఓసీలు-13, ఎస్టీలు-7, ఈ నేపథ్యంపై గ్రామ సర్పంచ్ పదవి సహా మూడు వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయడం పట్ల గ్రామానికి చెందిన మిట్టగడుపుల యాకూబ్, కాంగ్రెస్ కార్యకర్త గుండెపూరి వెంకన్నతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు గ్రామంలో కేవలం 7 మంది ఎస్టీ ఓటర్లు మాత్రమే ఉండగా వారికి ఒక సర్పంచ్, మూడు వార్డులు రిజర్వ్ చేయడం ఎలా సముచితం..? ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉన్నప్పుడు మిగతా రెండు వార్డుల్లో వారిసభ్యుల ఎంపిక ఎలా..? అని రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. ఈ అంశాలపై స్పష్టత వచ్చేంత వరకు మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story