గోదావరి వరదతో నిలిచిన కరకట్ట పనులు..!

by Ratna Kumari |

గోదావరికి ఎగువన ఉన్న తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ గేటు లేపి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మండల కేంద్రంలో జరుగుతున్న కరకట్ట నిర్మాణం పనులు నిలిచిపోయాయి.

గోదావరి వరదతో నిలిచిన కరకట్ట పనులు..!
X

దిశ, మంగపేట : గోదావరికి ఎగువన ఉన్న తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ గేటు లేపి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మండల కేంద్రంలో జరుగుతున్న కరకట్ట నిర్మాణం పనులు నిలిచిపోయాయి. ఐబీ అధికారులకు, కరకట్ట కాంట్రాక్టు వర్గాలకు ఎలాంటి సమాచారం లేకుండా సమ్మక్క బ్యారేజ్ అధికారులు ఒక్కసారిగా గేటు లేపడంతో అకస్మాత్తుగా వచ్చిన వరదతో పనులు నిలిచిపోగా జేసీబీలు, గ్యాబియన్ మెస్, క్లాత్ ఇతర పరికరాలు వరదలో కొట్టుకపోయినట్లు కాంట్రాక్టు వర్గాలు తెలిపారు. ముమ్మరంగా పనులు జరుగుతున్న వేళ గోదావరిలోకి వరదనీరు వదలడంతో పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. నీటి విడుదల సమయంలో ఐబీ అధికారుల మధ్య సమన్వయం లేకనే సమ్మక్య బ్యారేజ్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేటు విడుదల చేసి 700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Next Story