- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీవర్షంతో రాకపోకలు బంద్.. మంగపేటలో మునిగిన ప్రభుత్వ కార్యాలయాలు
ఎడతెరపి లేకుండా మంగపేట మండలంలో వర్షం కురిసింది. 190 మిల్లీ మీటర్లుగా వర్షపాతం నమోదైంది.

దిశ, మంగపేట: ఎడతెరపి లేకుండా మంగపేట మండలంలో వర్షం కురిసింది. 190 మిల్లీ మీటర్లుగా వర్షపాతం నమోదైంది. 12 గంటలుగా కుంభ వృష్టితో పడుతున్న వర్షానికి మండల కేంద్రంలోని రైతు వేదక, తహసీల్దార్ కార్యాలయం, మండల విద్యాశాఖ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, వెటర్నరీ దవాఖాన, ఫారెస్టు రేంజ్ కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలు నీట మునిగాయి. గౌరారంవాగు ముంపు ప్రాంతాలైన పొద్మూరు, వడ్డెర కాలనీలలోకి వరద నీరు ఇళ్లలోకి వచ్చింది. సహాయక చర్యలు చేపట్టేందుకు సైతం వీలు లేకుండా వర్షం కురిసింది. పరిస్థితిని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకరకు వివరిస్తున్నట్లు తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై తిరునగరి వెంకటరంగ సూరి, ఎంపీడీవో భద్రు తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిహాబిటేషన్ సెంటర్లను సిద్ధం చేసి పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. గోదావరి, గౌరారం వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ముంపు ప్రాంతాలైన మంగపేట, చుంచుపల్లి, రమణక్కపేట, రాజుపేట, వాడగూడెం, అకినేపల్లి మల్లారంలోని ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని హెచ్చరించారు.
పొంగి పొర్లుతున్న జీడివాగు..
మంగపేట-ఏటూరునాగారం మద్యలోని జీడివాగు పొంగి పొర్లుతుండడంతో రాక పోకలు నిలిపివేశారు. బ్రిడ్జి పైనుంచి వరద ప్రమాదకర స్థాయిలో పారుతుండడంతో ఏటూరునాగారం పోలీసులు బారీ కేడ్లను అడ్డుపెట్టి రాకపోకలను నిలిపివేశారు. దీంతో మంగపేట, మణుగూరు, భద్రాచలం నుండి ఏటూరునాగారం, హన్మకొండ, భూపాలపల్లి వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలచిచిపోయాయి.
కొట్టుకుపోయిన మిర్చినారు
చుంచుపల్లి వాడగూడెం రైతులకు చెందిన మిర్చి నారుమల్లు వరదల్లో కొట్టుకుపోవడంతో రూ.2 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధి రైతులు తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ముంపు ప్రాంతాల్లో మంత్రి పర్యటన..
మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. మండలంలోని కమలాపురం సుభాష్ చంద్రబోస్, ఇందిరా, ఎర్రవాగు ప్రాంతాలలో బాధితులను కలిశారు. ముంపు బాధితులు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావా కేంద్రంలో తలదాచుకోవాలన్నారు. బాధితులకు మంత్రి దుప్పట్లు అందజేశారు. మంత్రి వెంట మండల ప్రత్యేక అధికారి సిద్దార్థ రెడ్డి, తహసీల్దార్ తోట రవీందర్, ఎంపీడీవో భద్రు, ఎస్సై తిరునగరి వెంకటరంగ సూరి ఉన్నారు.






