బయ్యారం మండలంలో వడదెబ్బకు వ్యక్తి మృతి

by Bhanu |

వడదెబ్బతో కస్తూరి నగరం కేలోత్ రంగ్యా (52) సోమవారం మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఆలస్యంగా కస్తూరి నగరం గ్రామస్తులు తెలిపారు.

బయ్యారం మండలంలో వడదెబ్బకు వ్యక్తి మృతి
X

దిశ,బయ్యారం : వడదెబ్బతో కస్తూరి నగరం కేలోత్ రంగ్యా (52) సోమవారం మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఆలస్యంగా కస్తూరి నగరం గ్రామస్తులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..మృతుడు వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటారు.ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద ఎండకు తాళలేక అస్వస్థతకు గురై కింద పడిపోయి.విగతజీవిగా పడి ఉండటంతో, కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా వడదెబ్బ తగిలి తీవ్రమైన విరోచనాలు,వాంతులు చేసుకొని ఇంటివద్ద చనిపోయారనీ కుటుంబ సభ్యులు తెలిపారు.ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.



Next Story