కేయూ వైస్ ఛాన్సలర్ గుండెకు చికిత్స విజయవంతం..

by Kodari Anjali |   (  Updated:2026-07-28 11:38:02  IST  )

డాక్టర్ బుచ్చిరెడ్డి వైద్య బృందం ఆధ్వర్యంలో కేయూ వైస్ ఛాన్సలర్ స్టెంట్ అమర్చినట్లుగా కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది.

కేయూ వైస్ ఛాన్సలర్  గుండెకు చికిత్స విజయవంతం..
X

దిశ, హన్మకొండ టౌన్: కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి అనారోగ్య సమస్యలతో స్థానిక రోహిణి (ప్రైవేట్)హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. రోగనిర్ధారణ పరీక్షల అనంతరం ప్రతాపరెడ్డికి స్టెంట్ గుండెకు కొన్ని బ్లాక్స్ నిర్ధారణ కావడంతో సోమవారం సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మంగళవారం ఉదయం డాక్టర్ బుచ్చి రెడ్డి వైద్య బృందం ఆధ్వర్యంలో స్టెంట్ అమర్చినట్లుగా కాకతీయ యూనివర్సిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం విసి ఆరోగ్యంగా ఉన్నట్లు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని , ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు వైస్ ఛాన్సలర్‌ను పరామర్శించడానికి వచ్చి ఇబ్బంది పెట్టకూడదంటూ రిజిస్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Next Story