- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు
జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జిల్లాలో మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2400 కనీస మద్దతు ధర పూర్తి స్థాయిలో మద్దతు అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,07,991 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని సుమారు 3,77,969 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 97191.350 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
సుమారుగా 19,099 రైతుల నుంచి సుమారుగా రూ. 233.25 కోట్ల మొక్క జొన్నలు సేకరించడం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, నీడ, తేమ పరీక్షలు, తరలింపు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ పంటను సరైన నాణ్యతతో తీసుకురావాలని సూచించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు.






