- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో భర్తపై వేధింపుల కేసు..!
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామానికి చెందిన మహిళ తన రెండో భర్తపై వేధింపుల కేసు అకారణంగా పెట్టినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

దిశ, నర్సంపేట : నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామానికి చెందిన మహిళ తన రెండో భర్తపై వేధింపుల కేసు అకారణంగా పెట్టినట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. రెండేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటగా దుగ్గొండి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొన్ని ఏండ్లకు పెద్ద మనుషుల పంచాయతీతో విడిపోయినట్లు సమాచారం. అనంతరం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన ఓ యువకునితో సహజీవనం చేసినట్లు తెలుస్తోంది. నాలుగు సంవత్సరాల తర్వాత ఇరువురి మధ్య మనస్పార్థాలు వచ్చి విడిగా ఉంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తనపై 498ఎ, డౌరీ ప్రొహిబీషన్ యాక్ట్ 4, కేసులు 2024లో పెట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. సదరు మహిళ ప్రస్తుతం హైదరాబాద్ లో పబ్ నడుపుతున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొదటి పెళ్లి విడాకులు చట్ట బద్ధంగా తీసుకోలేదని, తర్వాత తాను పెళ్లి చేసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ క్రమంలో తనపై కేసు పెట్టి తన తో పాటు తన కుటుంబ సభ్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన కోర్టు వాయిదా ఉందని తెలిపారు.






