పత్తిపాకలో 'గన్' ప‌రేషాన్

by Ratna Kumari |

మండలంలోని పత్తిపాక గ్రామంలోని కల్లు మండువ వద్ద బుధవారం గన్ అనుమానంతో స్వల్ప కలకలం రేగింది.

పత్తిపాకలో గన్  ప‌రేషాన్
X

దిశ, శాయంపేట : మండలంలోని పత్తిపాక గ్రామంలోని కల్లు మండువ వద్ద బుధవారం గన్ అనుమానంతో స్వల్ప కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి తాటికల్లు తాగేందుకు వచ్చిన ముగ్గురు యువకుల్లో ఒకరు చేతులు వెనుక పెట్టుకొని నిలబడటం స్థానికుల్లో అనుమానాలకు దారి తీసింది. అతని వద్ద గన్ ఉండొచ్చని భావించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై జక్కుల పరమేశ్వర్ హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకొని యువకులను, వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి గన్ గానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభించలేదు. ఈ సందర్భంగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ.. “సమాచారం రాగానే వెంటనే స్పందించి తనిఖీలు నిర్వహించాం. గన్ అనుమానం పూర్తిగా అపోహ మాత్రమే” అని స్పష్టం చేశారు.

Next Story