పేలుళ్లలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలు ఎంజీఎం మార్చురీకి

by Bhanu |

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం తడపాల గుట్టలపై మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందగా వారి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించిన గ్రేహౌండ్స్ సిబ్బంది.

పేలుళ్లలో మృతి చెందిన జవాన్ల మృతదేహాలు ఎంజీఎం మార్చురీకి
X

దిశ, వరంగల్ : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం తడపాల గుట్టలపై మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందగా వారి మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించిన గ్రేహౌండ్స్ సిబ్బంది. మృతి చెందిన ముగ్గురు శ్రీధర్, సందీప్, పవన్ కళ్యాణ్ జవాన్లుగా గుర్తింపు. ఇదే ఘటనలో వరంగల్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎస్ఐ రణధీర్ తీవ్ర గాయాల పాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వరంగల్ కు చేరుకున్న డీజీపీ జితేందర్, గ్రేహౌండ్స్ డీజీ స్టీఫెన్ రవీంద్ర మరికొద్ది సేపట్లో ఎంజీఎం మార్చరీలో మృతదేహాలను సందర్శించనున్నారు. ఇప్పటికే ఎంజీఎం మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి.


Next Story