గ్రామ‌పంచాయ‌తీల వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి అధిక నిధుల మంజూరు

by Ratna Kumari |

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనిబుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్నేహ శబరిష్, అధ్యక్షతన జిల్లా స్థాయి అభివృద్ధి పనుల సమీక్షా సమావేశం నిర్వహించారు.

గ్రామ‌పంచాయ‌తీల వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి అధిక నిధుల మంజూరు
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనిబుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్నేహ శబరిష్, అధ్యక్షతన జిల్లా స్థాయి అభివృద్ధి పనుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క, సీఎం సలహాదారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసన సభ్యులు, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వేసవి తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో అత్యంత అధిక ప్రాధాన్యతగా త్రాగునీటి సమస్య రాకుండా క్షేత్రస్థాయిలోపంచాయతీరాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినందున పద్దుల వారీగా ఖర్చులు చేసి అభివృద్ధికి కృషి చేయాలని, ప్రస్తుతం ధాన్యం మొక్కజొన్న ల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల వ్యవస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తుందని నిత్యం గ్రామాలు పట్టణాల పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు.


అభివృద్ధి పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని అట్టివారిని సహించేది లేదన్నారు, ముఖ్యమంత్రి సలహాదారు రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే జూన్ మాసంలో జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, ఉద్యానవన శాఖ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల భవన నిర్మాణాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి, మున్సిపల్ తదితర శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచి ప్రారంభోత్సవం శంకుస్థాపనలకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్లో మరి ధాన్యం, మొక్కజొన్నల దిగుబడి అధికంగా ఉన్నందున అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో సిబ్బందిని హమాలీలను లారీలను, ట్రాక్టర్స్, డీసీఎం, తదితర సదుపాయాల ద్వారా ధాన్యాన్ని, మొక్కజొన్నలను కొనుగోలు చేసి వెంట వెంటనే తరలించాలని సూచించారు.


పంట మార్పిడి విధానం పై రైతులకు అవగాహన కల్పించాలని ధాన్యంతో పాటు ఇతర వాణిజ్య పంటలను సాగు చేసేందుకు ప్రోత్సహించాలని తద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని కోతుల బెడద కూడా లేకుండా ఉంటుందని సూచించారు. జిల్లాలోని ఐదు మున్సిపల్ ప్రాంతాల అభివృద్ధి కోసం సుమారు 150 నుండి 200 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ ఉంటూ ఉండాలని సూచించారు, జిల్లాలో కొంతమంది నిరుపేదలు అటవీ భూములు, పోడు భూముల సమస్యలు ఉన్నందున అర్హులైన నిరుపేదలు అట్టి భూములలో నివాస స్థలాలు ఏర్పరచుకొని ఉన్నారని వారిని అటవీశాఖ అధికారులు కొంత ఇబ్బందులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, పేద ప్రజల ను ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వ అధికారులు సహకరించాలని కోరారు. మక్కలు,ధాన్యం కొనుగోళ్లలో కొంతమంది కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అందుకు అధికారులు వారు చేస్తున్న పనుల వివరాలను వెంటవెంటనే తెలియపరచాలని సూచించారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న,ధాన్యం కొనుగోళ్లలో అధికారులు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం కోసం ముందస్తు చర్యలు తీసుకొని సాగాలన్నారు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోల పనితీరులలో పారదర్శకంగా వ్యవహరించి నిధులను సక్రమంగా వినియోగించే విధంగా పంచాయతీరాజ్ డిపిఓ చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి సాధించుకోవాలని తెలిపారు. మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ జిల్లాలో మక్కలు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లాలో తక్కువ శాతం కొనుగోలు అయిందని తెలిపారు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం నిల్వల కోసం గోదాములను పరిశీలించాలని, ధాన్యాన్ని తరలించడం కోసం వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని, హమాలీలను అధికంగా నియమించుకోవాలని సూచించారు. సమావేశానికి హాజరైన మంత్రి, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు మక్కలు, దాన్యం కొనుగోళ్ల, అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు నిర్వహణ తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ కార్యాలయ) నిర్మాణం వివరాలను కోరగా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ ఇప్పటికే దాదాపుగా పూర్తయిన కార్యాలయ పనులలో పెండింగ్ ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకొని సంబంధిత అధికారులను ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.అనంతరం వారు చెప్పిన సూచనలు సలహాలు స్వీకరించుకుని సంబంధిత అధికారులకు జారీ చేసి ప్రత్యక్షంగా స్వయంగా పనులు సమస్యల పరిష్కారం నిమిత్తం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా ఫారెస్ట్ అధికారి విశాల్ బత్తుల, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి, మహబూబాబాద్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్మన్ గంటా సంజీవ రెడ్డి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, డోర్నకల్, మరిపెడ తొర్రూరు, కేసముద్రం మున్సిపల్ చైర్ పర్సన్లు , వైస్ చైర్మన్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story