- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టి కూలడంతో జీపీ కార్మికుడి దుర్మరణం..
మట్టి కూలడంతో గ్రామపంచాయతీ కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో జరిగింది.

X
దిశ, దుగ్గొండి: మట్టి కూలడంతో గ్రామపంచాయతీ కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. దేశాయిపల్లి గ్రామ పంచాయతీలో కార్మికుడిగా వీణవంక శంకర్(50) విధులు నిర్వహిస్తున్నాడు. విధుల్లో భాగంగా గ్రామంలో నీటి సరఫరా కోసం పైపులైన్ మరమ్మత్తు పనులు చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అయిన శంకర్, నల్లబెల్లి బాబు ఇద్దరు కలిసి పని చేస్తున్నారు. ప్రమాదవశాత్తు పైన ఉన్న మట్టి ఒక్కసారిగా కూలడంతో వీణవంక శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, నల్లబెల్లి బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Next Story






