ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గౌతమ్ జూనియర్ కాలేజీలో ఉచిత విద్య..

by Bhanu |   (  Updated:2025-05-02 10:59:00  IST  )

తెలంగాణలో ఇటీవల ప్రకటించిన 2024 - 25 సంవత్సర ఫలితాల్లో విడుదలైన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణమైన విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు కట్టుబడి ఉన్న గౌతమ్ జూనియర్ కాలేజీ, టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ ప్రకటన చేసింది.

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గౌతమ్ జూనియర్ కాలేజీలో ఉచిత విద్య..
X

దిశ, హనుమకొండ : తెలంగాణలో ఇటీవల ప్రకటించిన 2024 - 25 సంవత్సర ఫలితాల్లో విడుదలైన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణమైన విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు కట్టుబడి ఉన్న గౌతమ్ జూనియర్ కాలేజీ, టాలెంట్ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ ప్రకటన చేసింది. కాలేజీ డైరెక్టర్ అంబీర శ్రీకాంత్ మాట్లాడుతూ.. 10వ తరగతిలో 560 మార్కులు పైగా సాధించిన విద్యార్థులకు హాస్టల్ తో సహా పూర్తి ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. అలాగే 540 నుండి 560 మార్కులు వచ్చిన వారికి పూర్తి ట్యూషన్ ఫీజు మాఫీ, 500 నుండి 540 మార్కుల మధ్య వచ్చిన విద్యార్థులకు 50% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అవకాశాన్ని విద్యార్థులు పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు.



Next Story