పేదల కష్టాలకు ప్రభుత్వం అండ : మంత్రి సీతక్క

by Ratna Kumari |   (  Updated:2026-05-28 09:08:17  IST  )

కళ్యాణ లక్ష్మీ షాధీముబారక్ చెక్కుల పంపిణీ ద్వారా ప్రభుత్వం పేదల కష్టాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు.

పేదల కష్టాలకు ప్రభుత్వం అండ : మంత్రి సీతక్క
X

దిశ, మంగపేట : కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ ద్వారా ప్రభుత్వం పేదల కష్టాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేధికలో తహశీల్దార్ తోట రవీందర్ అధ్య‌క్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మండలంలోని 29 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాధీముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేదల కష్టాలకు అండగా ఉండాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలైన వారి పిల్లల పెళ్లికి కళ్యాణ‌ లక్ష్మీ, షాధీ ముబారక్ పథకంలో లక్షా వెయ్యి నూటపదహారు రూపాయలను అందజేస్తుందన్నారు. దీంతో ఆ కుటుంబాల్లో ఉన్న ఆర్ధిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోతాయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి కళ్యాణ‌ల‌క్ష్మీ, షాధీముబారక్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రందాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాని, మాజీ సొసైటీ చైర్మన్ తోట రమేష్, మండల పార్టీ అధ్య‌క్షుడు మైల జయరాం రెడ్డి, జిల్లా, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story