ఇనుగుర్తి మండలానికి ప్రభుత్వం దసరా కానుక

by velandi.Saikiran |

మండల కేంద్రంలో 13 గ్రామాలతో పోలిస్ స్టేషన్ మంజూరు చేస్తు 116జీవొను విడుదల చేయడమే కాకుండా 45.15కోట్లతో కార్మిక ఉపాధి

ఇనుగుర్తి మండలానికి ప్రభుత్వం దసరా కానుక
X

దిశ, ఇనుగుర్తి: మండల కేంద్రంలో 13 గ్రామాలతో పోలిస్ స్టేషన్ మంజూరు చేస్తు 116జీవొను విడుదల చేయడమే కాకుండా 45.15కోట్లతో కార్మిక ఉపాధి శిక్షణ కర్మగారాలశాఖ(టాటా) టెక్నాలజీ లిమిటెడ్ సహకారంతో ఆరు కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జివో జారీ చేసింది. ఈ త‌రుణంలోనే... ఇనుగుర్తి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా పోలిస్ స్టేషన్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాణసంచలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కూరెళ్ళి సతీష్,జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నాల కట్టయ్య మాట్లాడుతూ మండల సాధనలో ఉద్యమ కారుల పాత్ర మరువలేనిదన్నారు. ఎన్నో పోరాటాలతో సాధించిన మండలం పూర్తి స్థాయి కార్యలయాలతో రూపాంతరం చెందడానికి సహకరించిన ముఖ్యమంత్రి సలహాదారుడు వెం.నరేందర్ రెడ్డి,ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story