- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

దిశ జనగామ/ పాలకుర్తి : ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కార్యక్రమాలకు వెళ్తున్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి మండలం తొర్రూరు గ్రామంలో ఇంకా కొనుగోలు చేయకుండా కల్లాలో ఉన్న ధాన్యం చూసి వెంటనే తన కారు ఆపి రైతుల వద్దకు వెళ్లి కొనుగోళ్లు జరిగే ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎర్రబెల్లితో మాట్లాడారు. గత 40 రోజుల పైగా ధాన్యం రాశులు పోసినా లారీలు లేక, గన్ని బ్యాగులు లేక కొనుగోళ్లు జరగడం లేదని తెలిపారు. అలాగే కల్లాలో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు వచ్చి వెళ్ళడమే తప్ప మా పంట కొనడం గురించి ఆలోచించడం లేదన్నారు. రైతుల సమస్యలు విన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలెక్టర్ సందీప్ కుమార్ తో మాట్లాడి రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ స్పందించి రైతులు పండించిన వడ్లు కొనుగోళ్లు పూర్తి చేయిస్తానని చెప్పారు. అంతే కాకుండా మీ దృష్టికి ఇంకా కొనుగోళ్లు కానీ ప్రాంతాలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు. రాష్ట్రంలో రైతుల పట్లా రాక్షస పాలన సాగుతోందని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కి రైతుల పట్ల ప్రేమ ఉంటే వడ్ల కొనుగోలు విషయంలో ముందస్తు రివ్యూ లు పెట్టి ధాన్యం కొనుగోలు పై అధికారులకు ముందస్తు సూచనలు ఇచ్చే వారన్నారు. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రైతులు ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.






