- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో గూగుల్ మ్యాప్.. దారి ఇంటికి కాదు, యమలోకానికే!
జనగామ జిల్లాలో గూగుల్ మ్యాప్ చూపిన దారి ఓ రోడ్డు ప్రమాదానికి దారితీసింది.

దిశ, జనగామ టౌన్ : జనగామ జిల్లాలో గూగుల్ మ్యాప్ చూపిన దారి ఓ రోడ్డు ప్రమాదానికి దారితీసింది. వడ్లకొండ ఎక్స్ రోడ్ వద్ద గనుగుపహాడ్ వాగు బ్రిడ్జి సమీపంలో ఓ కారు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి లోయలోకి జారిపడిన ఘటన రాత్రి సమయంలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రకు చెందిన ఐదుగురు యువకులు తమ కారులో ప్రయాణిస్తున్న సమయంలో గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించి మార్గం వెతుక్కుంటూ వస్తుండగా, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడంతో వారు నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో కారు నేరుగా లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడ్డారు, ఇంకొకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
గాయపడ్డవారిని స్థానికులు అంబులెన్స్‌లో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రాత్రి సమయంలో కనీసం సూచిక బోర్డులు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేసి, పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనాలని, లేకపోతే ఇంకా ప్రాణనష్టం, గాయాల ఘటనలు తప్పవని ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.






