- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. PMIS దరఖాస్తులకు ఆహ్వానం
యువతకు వృత్తి పరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) ను జిల్లాలో అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్. శ్రీమన్నారాయణ రెడ్డి తెలిపారు.

దిశ, మహబూబాబాద్ టౌన్ : యువతకు వృత్తి పరమైన నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) ను జిల్లాలో అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్. శ్రీమన్నారాయణ రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద సంవత్సరానికి 1.25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం మూడో దశలో అభ్యర్థులకు ఇచ్చే స్టైఫండ్‌ను రూ.9,000కు పెంచినట్టు ఆయన తెలిపారు. అదనంగా వన్‌టైమ్ గ్రాంట్‌గా రూ.6,000 కూడా అందజేయనున్నట్టు తెలిపారు.
అర్హతలు
21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు లేదా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు ప్రముఖ సంస్థలలో వాస్తవ పని అనుభవంతో పాటు వృత్తి నైపుణ్యాలు పెంపొందించబడతాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఐటీ, తయారీ వంటి 24 రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు శిక్షణ అందిస్తున్నాయి. ఇంటర్న్‌లకు నెలకు స్టైఫండ్‌తో పాటు వ్యక్తిగత బీమా సౌకర్యం కూడా కల్పించబడుతుంది. ఈ పథకం ద్వారా శిక్షణ పొందిన యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలలో స్థిరపడే అవకాశాలు మెరుగవుతాయి. అర్హులైన యువత ఈ నెల 28వ తేదీ లోగా అధికారిక వెబ్‌సైట్ https://pminternship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఈ పథకంపై అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.






