గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

by Elthuri vijay kumar |

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.

గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
X

గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

దిశ, భూపాలపల్లి : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, అగ్నిమాపక, వైద్య, ఆర్టీసీ, విద్యుత్తు, ఉద్యాన, ఆర్ అండ్ బి, మహిళా సంక్షేమ, జాతీయ రహదారులు, మత్స్య, దేవాదాయ తదితర శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ లక్షలాది భక్తులు పుష్కరాల కోసం రానున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీరు, విద్యుత్, శానిటేషన్, వైద్య సేవలు, రవాణా, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. మూడు రోజుల్లో శాఖల వారీగా అంచనా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఘాట్ల వద్ద శుభ్రత, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, తాత్కాలిక వసతి గృహాలు, వైద్య శిబిరాలు వంటి ఏర్పాట్లను ప్రణాళికలో చేర్చాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story