మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు

by Bhanu |   (  Updated:2025-05-26 15:33:09  IST  )

గీసుగొండ పోలీసులు మనుగొండ గ్రామానికి చెందిన మేకల రాజ్ కుమార్, కొమ్ము పవన్ మీద మహిళపై అత్యాచార యత్నానికి సంబంధించిన కేసు నమోదు చేశారు.

మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు
X

దిశ, గీసుగొండ: గీసుగొండ పోలీసులు మనుగొండ గ్రామానికి చెందిన మేకల రాజ్ కుమార్, కొమ్ము పవన్ మీద మహిళపై అత్యాచార యత్నానికి సంబంధించిన కేసు నమోదు చేశారు. సీఐ ఎ. మహేంద్ర వివరాల ప్రకారం, మనుగొండ గ్రామానికి చెందిన ఎంబాడి సామ్రాజ్యం తన కొడుకు నరేందర్‌తో గొడవ పడుతూ ఉన్న సందర్భంలో మేకల రాజ్ కుమార్ దుర్భాషలాడి, తనపై అనుచిత హస్తాక్షేపం చేసి, దాడి చేసి, ఆమెను నేలకొట్టిన తరువాత చీరలాగి అత్యాచారానికి యత్నించాడు.


ఈ ఘటనను ఆపడానికి ఎంబాడి సామ్రాజ్యం భర్త శంకర్ వచ్చేందుకు ప్రయత్నించగా, మేకల రాజ్ కుమార్, కొమ్ము పవన్ ఇద్దరు అతడిపై దాడి చేసి ఎడమ చెవూ, ఎడమ చేతి కండరాలపై తీవ్రగాయాలు చేశారని తెలిసింది. అంతేకాదు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చంపేస్తామని బెదిరింపులు వేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మేకల రాజ్ కుమార్, కొమ్ము పవన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story