టిప్పర్ ఢీకొన్న ఘటనలో బాలిక మృతి

by Bhanu |

పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

టిప్పర్ ఢీకొన్న ఘటనలో బాలిక మృతి
X

దిశ, పాలకుర్తి: పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కిష్టు తండాలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ క్రాంతి కిరణ్ అందించిన సమాచారం ప్రకారం, కిష్టు తండాకు చెందిన జాటోతో ఇందుమతి (11) వేసవి సెలవుల్లో ఉన్న సందర్భంగా సైకిల్‌పై తండా శివారులోని గుడికి వెళ్లడానికి సర్వీస్ రోడ్ మార్గంగా ప్రయాణించిందని తెలిపారు.

అదే సమయంలో TS07UM9064 నంబరు గల టిప్పర్ వాహనం వేగంగా వచ్చి, డ్రైవర్ అజాగ్రత్తతో బాలికను ఢీకొట్టడంతో వాహనం ఆమెపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఇందుమతి అక్కడికక్కడే మృతిచెందిందని ఎస్ఐ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story