- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి విక్రయదారుల అరెస్ట్
by velandi.Saikiran |
గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించినట్లుగా సిఐ విశ్వేశ్వర్ తెలిపారు.

X
దిశ , గీసుకొండ: గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించినట్లుగా సిఐ విశ్వేశ్వర్ తెలిపారు. సిఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం....భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లి గ్రామానికి చెందిన భోగి నవీన్ ,రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కటకం కళ్యాణ్, గీసుకొండ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన బెంబిరి అరవింద్ ,బెంబిరి మహేష్ ఈ నలుగురు గంజాయి విక్రయిస్తున్నారు. హైదరాబాద్ ధూల్పేట కు చెందిన గుర్తు తెలియని వ్యక్తి వద్ద ఎండు గంజాయి కొనుగోలు చేసి మండలంలోని ధర్మారం గ్రామ ఉరచెరువు వద్ద అనుమానాస్పదంగా కనిపించారు ఈ నలుగురు. ఈ సందర్భంగా 145 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






