గొర్రెలు ఎత్తుకెళ్లిన దొంగల ముఠా అరెస్ట్..

by Taduka Kalyani |

దుర్గంపేట క్రాస్ వద్ద ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్ ఆర్. సంతోష్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో గొర్రెల దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు.

గొర్రెలు ఎత్తుకెళ్లిన  దొంగల ముఠా అరెస్ట్..
X

దిశ, ​ఆత్మకూరు: దుర్గంపేట క్రాస్ వద్ద ఆత్మకూరు ఇన్‌స్పెక్టర్ ఆర్. సంతోష్ తన సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో గొర్రెల దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసులకు చిక్కారు. ​పోలీసుల కథనం ప్రకారం.. ఆత్మకూరు కు చెందిన తనుగుల రాజు (30), పైడిపల్లి కి చెందిన జన్ను అజయ్, గూడెప్పాడుకు చెందిన ఎలుమకంటి విశాల్‌ అనే ముగ్గురు ఆటో డ్రైవర్లు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత ఏప్రిల్ 23న రాత్రి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న షెడ్ నుంచి ఒక గొర్రె, పొట్టేలు, మేకపోతును దొంగిలించి ఆటోలో హన్మకొండ కు తరలించారు. అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తికి వాటిని రూ. 25,000కు విక్రయించి, ఆ సొమ్మును పంచుకున్నారు. మంగళవారం పోలీసుల తనిఖీలను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన ఆటో (TS 03 UB 1994), రూ. 25,000 నగదు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు జప్తు చేసి కేసు నమోదు చేశారు.

Next Story