- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా, శాయంపేట మండల కేంద్రంలో317 జీవోను రద్దు చేయాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఊపిరి తీస్తున్న జీవో 317ను రద్దు చేయాలన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలని, ఉద్యోగుల స్థానికతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 317జీవోతో ఉద్యోగులు స్థానికతను కోల్పోయే అవకాశముందని పేర్కొన్నారు. ఉద్యోగుల ఉసురుతీస్తోన్న 317జీవోను రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన జీవో 317ను వెనక్కి తీసుకుని, ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని అన్నారు. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాలు చిన్నాభిన్నమై శాశ్వతంగా వాళ్ల స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.






