ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తా : మంత్రి సీతక్క

by Ratna Kumari |

ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు మొదలు పెడితే నిధులు మంజూరు చేసే బాధ్యత తనదేనని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ -శిశు సంక్షేమ, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తా : మంత్రి సీతక్క
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు మొదలు పెడితే నిధులు మంజూరు చేసే బాధ్యత తనదేనని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ -శిశు సంక్షేమ, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జిల్లా జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోని నాయకులు భవన నిర్మాణం చేపట్టాలని, ఇళ్ల‌ స్థలాలు కేటాయించాలని కోరుతూ వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడం శోచనీయమని, భవన నిర్మాణం కోసం 2024 శంకుస్థాపన చేసినప్పటికీ నేటికీ పనులు ప్రారంభించకపోవడం బాధాకరమై విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో పాత్రికేయులలో సమైక్యత లేకపోవడం గ్రూపులు ఏర్పాటు చేసుకోవడం వ‌ల్ల‌ భవన నిర్మాణ పనులలో జాప్యం జరుగుతున్నదని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో జాక్ జిల్లా కన్వీనర్ గుర్రపు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు జినుకల ప్రభాకర్, కో- కన్వీనర్ ఎనగందుల కుమార్, సంఘ నాయకులు రంజిత్, చల్ల గురుకుల రాజు వర్ధన్, పాత్రికేయులు పాల్గొన్నారు.

Next Story