కొమ్మాల గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

by Taduka Kalyani |

కొమ్మాల గ్రామంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కొమ్మాల గ్రామ సర్పంచ్ కన్నెబోయిన యమునా ప్రవీణ్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కొమ్మాల గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
X

దిశ, గీసుకొండ : కొమ్మాల గ్రామంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కొమ్మాల గ్రామ సర్పంచ్ కన్నెబోయిన యమునా ప్రవీణ్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గ్రామంలో భారీ ర్యాలీ

కొమ్మాల స్టేజీ నుంచి గ్రామ పంచాయతీ వరకు కోలాటాలు, డప్పు చప్పుళ్ళతో భారీ ర్యాలీ నిర్వహించారు. చేరిన నాయకులకు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా*కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొమ్మాల గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు అండగా ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. పార్టీలకు అతీతంగా పేద కుటుంబాల పెండ్లి సహాయం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఆసుపత్రి సహాయం, పాఠశాల పిల్లలకు అల్పాహారం అందిస్తున్నామన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి పరకాలలో మహిళా పాడి కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని,వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి రుణాలు ఇస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story