సంక్షోభం నుంచి సంక్షేమ వైపు

by Ratna Kumari |

ప్రజలు ఇచ్చిన శక్తి, సామర్ధ్యాలతో ప్రజా ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు.. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు.

సంక్షోభం నుంచి సంక్షేమ వైపు
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : ప్రజలు ఇచ్చిన శక్తి, సామర్ధ్యాలతో ప్రజా ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు.. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద అమరవీరులకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐడిఓసి కార్యాలయానికి విచ్చేసిన విప్ యెన్నం శ్రీనివాస రెడ్డికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి సంకీర్త్ పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరుల స్పూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి వైపు పయనం సాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి సాధనకు విజన్ 2047తో ముదుకెళ్తున్నామన్నారు. ఈ లక్ష్యసాధనకు బలమైన పునాదులు వేసేందుకు గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, గ్రంధాలయ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నృత్య ప్రదర్శన చేసిన విద్యార్థులు, సాంస్కృతిక సారథి కళాకారులతో ఫోటోలు దిగారు.

Next Story